Weekly Rasi Phalalu : ఈరోజు రాశిలో ఫలాలు ఎలా ఉంటాయి? ఆదివారం జూన్ 22వ తేదీ ఏ రాశులు అత్యంత జాగ్రత్త ఉండాల్సి ఉంటుంది. ఏ రాశివారికి విజయం వరిస్తుంది. రాశుల ఫలితాలు తెలుసుకుందాం..
మేషం : ఈ వారం చేపట్టిన పనుల్లో వేగం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మద్దతు లభిస్తుంది. ఆస్తి సంబంధిత ఒప్పందాలు అనుకూలంగా సాగుతాయి. ప్రయాణయోగం ఉంది. వివాహ ప్రయత్నాలు తుది దశకు చేరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో మార్పులు సాధ్యమే. వ్యాపారాలు మెల్లగా లాభదిశగా సాగుతాయి.
శుభరంగులు : ఎరుపు, తెలుపు
శుభపాఠం : ఆదిత్య హృదయం
వృషభం : కోరుకున్న వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి బలోపేతమై రుణభారం తగ్గుతుంది. కుటుంబంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గుతాయి.
శుభరంగులు : పసుపు, ఆకుపచ్చ
శుభపాఠం : హనుమాన్ చాలీసా
మిథునం : ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సాధ్యం. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు వస్తాయి.
శుభరంగులు : గులాబీ, పసుపు
శుభపాఠం : గణేశాష్టకం
కర్కాటకం : ఆలస్యమైన పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం సూచన ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకోని అవకాశాలు లభిస్తాయి.
శుభరంగులు : గులాబీ, నేరేడు
శుభపాఠం : లక్ష్మీ నృసింహ స్తోత్రాలు
సింహం : పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి వృద్ధి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఉద్యోగ లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి.
శుభరంగులు : నేరేడు, తెలుపు
శుభపాఠం : లక్ష్మీ స్తుతి
కన్య : అవాంతరాలు తొలగి పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా సంతృప్తి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భూమి, వాహన యోగం ఉంది. ఉద్యోగ ఒత్తిడి తగ్గుతుంది.
శుభరంగులు : నీలం, ఆకుపచ్చ
శుభపాఠం : సుబ్రహ్మణ్యాష్టకం
తుల : ఆర్థిక పురోగతి కనిపించినా ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో నిలిచిపోయిన పనులు కదులుతాయి. వాహన, గృహ కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ మార్పుల సూచనలు ఉన్నాయి.
శుభరంగులు : పసుపు, తెలుపు
శుభపాఠం : ఈశ్వరారాధన
వృశ్చికం : ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో ఆలస్యం ఉండొచ్చు. అయితే వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో మార్పులు సంభవించవచ్చు.
శుభరంగులు : గులాబీ, నీలం
శుభపాఠం : విష్ణు సహస్రనామం
ధనుస్సు : స్వల్ప ఆటంకాలున్నా చివరికి విజయమే. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి అవకాశాలు.
శుభరంగులు : గులాబీ, లేత ఆకుపచ్చ
శుభపాఠం : దేవీ ఖడ్గమాల
మకరం : ఏ పని చేపట్టినా విజయ సూచనలు స్పష్టంగా ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు, వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
శుభరంగులు : ఎరుపు, నేరేడు
శుభపాఠం : అన్నపూర్ణాష్టకం
కుంభం : శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. ఇంటి నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణకు మంచి సమయం.
శుభరంగులు : గులాబీ, నేరేడు
శుభపాఠం : సుబ్రహ్మణ్య స్తోత్రాలు
మీనం : ఆర్థిక వ్యవహారాలు సాధారణంగానే ఉన్నా అవసరాలు తీరుతాయి. ఆస్తి సమస్యలు తొలగుతాయి. వాహన, గృహ కొనుగోలు యత్నాలు సానుకూలం. ఉద్యోగ మార్పులు ఆశించిన విధంగా ఉండవచ్చు.
శుభరంగులు : ఆకుపచ్చ, తెలుపు
శుభపాఠం : అన్నపూర్ణాష్టకం

